ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

వెజ్ ఆర్డర్ చేస్తే..నాన్ వెజ్, రూ.50 లక్షలు పరిహారం అడుగుతున్న మహిళ..

గుజరాత్‌ లోని అహ్మదాబాద్‌కు చెందిన ఓ మహిళకు ఫుడ్ ఆర్డర్ పెట్టినప్పుడు ఊహించని అనుభవం ఎదురైంది. దీంతో ఆమె రూ.50 లక్షల నష్టపరిహారం కోరుతూ కోర్టుకెక్కింది . వివరాల్లోకి వెళితే..అహ్మదాబాద్‌  లోని చాముంద‌గ‌ర్‌లో ఉండే నిరాలీ పర్మార్  ఆన్‌లైన్‌ ద్వారా పనీర్ టిక్కా శాండ్‌విచ్  ఆర్డర్ చేసింది. ఎప్పటిలాగే ఫుడ్‌ డెలీవరి బాయ్ ఇంటికి తీసుకొచ్చి పార్సిల్ అందించాడు. అయితే ఆమె ఆ శాండ్‌విచ్‌ను కొద్దిగా తిని షాకైంది.  ఎందుకంటే అది పనీర్ శాండ్‌విచ్ కాదు. చికెన్ శాండ్‌విచ్. పూర్తిగా శాకాహారి అయిన ఆమె షాకైంది. వెంటనే అహ్మదాబాద్ హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులకు ఫిర్యాదు చేసింది. నష్టపరిహారంగా సదరు రెస్టారెంట్‌ తనకు రూ.50 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేసింది . తను పూర్తి శాకాహారినని, మాంసాహారం తినడాన్ని తమ మతం ఒప్పుకోదని రెస్టారెంట్ చేసిన తప్పిదంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ఆమె చెప్పుకొచ్చింది. రెస్టారెంట్‌పై దావా వేసింది. సంబంధిత అధికారులు సదరు రెస్టారెంట్‌కు నోటీసులు పంపించారు.
ఇటీవలి పోస్ట్‌లు

భారతీయలు ఎవరైనా   పాకిస్తాన్ కి  హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని  చెప్ప వచ్చు ... 

కాశ్మీర్ లోని బారాముల్లా  ప్రాంతానికి చెందిన వ్యక్తి జావీద్  అహ్మద్ హజం ఆర్టికల్ 370 రద్దుకు నిరసనగా "బ్లాక్ డే " అని చెప్పడం ,  పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం  అయిన   ఆగస్టు 14 న శుభాకాంక్షలు చెప్పడం మీద  పోలీసులు నమోదు చేసిన కేసును సుప్రీం కోర్టు  కొట్టి వేసింది. భారత్ పౌరులందరికి  పాకిస్తాన్ తో సహా ఇతర దేశాల స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పడం తప్పేమి కాదు అని తీర్పు ని ఇచ్చింది .