భారతీయలు ఎవరైనా పాకిస్తాన్ కి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్ప వచ్చు ...
కాశ్మీర్ లోని బారాముల్లా ప్రాంతానికి చెందిన వ్యక్తి జావీద్ అహ్మద్ హజం ఆర్టికల్ 370 రద్దుకు నిరసనగా "బ్లాక్ డే " అని చెప్పడం , పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం అయిన ఆగస్టు 14 న శుభాకాంక్షలు చెప్పడం మీద పోలీసులు నమోదు చేసిన కేసును సుప్రీం కోర్టు కొట్టి వేసింది. భారత్ పౌరులందరికి పాకిస్తాన్ తో సహా ఇతర దేశాల స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పడం తప్పేమి కాదు అని తీర్పు ని ఇచ్చింది .